Home > తెలంగాణ > Bandla Ganesh: కూకట్ పల్లి నుంచి పోటీపై బండ్ల గణేష్ క్లారిటీ

Bandla Ganesh: కూకట్ పల్లి నుంచి పోటీపై బండ్ల గణేష్ క్లారిటీ

Bandla Ganesh: కూకట్ పల్లి నుంచి పోటీపై బండ్ల గణేష్ క్లారిటీ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని చెప్పారు. తనకు టికెట్ ముఖ్యం కాదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. కూకట్ పల్లి నుంచి కాంగ్రెస్ తరుపున బండ్ల గణేష్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన ట్వీట్ చేశారు.

‘‘నేను ఈ సారి జరిగే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయ్యను. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం.. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు ధన్యవాదాలు. నేను టికెట్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం.. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం’’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

Updated : 8 Oct 2023 11:23 AM IST
Tags:    
Next Story
Share it
Top