Home > తెలంగాణ > MLA Raja Singh : హుస్సేన్ సాగర్‎లోనే గణేశ్ నిమజ్జనం చేసి తీరుతాం : ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Raja Singh : హుస్సేన్ సాగర్‎లోనే గణేశ్ నిమజ్జనం చేసి తీరుతాం : ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Raja Singh : హుస్సేన్ సాగర్‎లోనే గణేశ్ నిమజ్జనం చేసి తీరుతాం : ఎమ్మెల్యే రాజాసింగ్
X

తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు.( MLA Raja Singh On Ganesh Immersion ) గణేష్ నిమజ్జనంపై కోర్టులో ఎందుకు వాదించలేకపోతున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. గత జీఓలను కోర్టుకు ప్రభుత్వం చూపించట్లేదని, ఎప్పటిలాగే నిమజ్జనం కొనసాగుతుందని అన్నారు. ఎవరైనా అడ్డొస్తే ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలన్నారు. హుస్సేన్ సాగర్‎లో మురికినీరు కలవకుండా సర్కార్ చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ తెలిపారు.

" హుస్సేన్ సాగర్‎లోనే యధావిధిగా గణేష్ నిమజ్జనం చేసి తీరుతాం. పోలీసులు అడ్డుకున్నా, ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానిదే బాధ్యత. హైకోర్టులో ప్రభుత్వం తన వాదనలను సరిగా వినిపించలేకపోయింది. అందుకే కోర్టు నిమజ్జనాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. గత 30 ఏళ్లుగా హుస్సేన్ సాగర్‎లోనే గణేశ్ నిమజ్జనాలు చేస్తున్నాం. ఇప్పుడు చేసి తీరుతాం. గణేష్ నిమజ్జనాలు చేస్తేనే హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతోందా..? కెమికల్ ఫ్యాక్టరీలు, బస్తీల నుండి నాలాల ద్వారా కలుషిత నీరు హుస్సేన్ సాగర్‎లో చేరుతోంది. హుస్సేన్ సాగర్‎ని కొబ్బరి నీళ్లతో నింపుతానన్న కేసీఆర్ హామీ ఏమైంది? హిందువుల ఐక్యతని చూసి ఓర్వలేకనే గణేష్ నిమజ్జనాన్నిఅడ్డుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా గణేశ్ నిమజ్జనం జరుగుతుంది. దీనిని ఎవరూ ఆపలేరు"అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.




Updated : 26 Sept 2023 5:08 PM IST
Tags:    
Next Story
Share it
Top