21 కిలోల గణేష్ లడ్డూ ఎత్తుకెళ్లిన స్కూల్ స్టూడెంట్స్
X
గణేష్ మండపాల వద్ద ఉండే లడ్డూ దొంగతనాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఇక్కడి లడ్డూ ఎత్తుకెళ్లింది దుండగులో.. దొంగలో కాదు. స్కూల్ పిల్లలు. అది కూడా చిన్నది అనుకుంటే పొరపాటే.. ఏకంగా 21 కిలోల గణేష్ లడ్డూను ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన మండప నిర్వాహకులు నివ్వెరపోయారు. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్, చార్మినార్ సమీపంలోని ఘాన్సీ బజార్ సమీపంలో ఈ లడ్డూ దొంగతనం జరిగింది. లడ్డూ దొంగతనం జరిగిందని గణేష్ మండప నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో.. స్కూల్ విడిచిన తర్వాత ఇంటికి వెళ్తున్న స్టూడెంట్స్.. గణేష్ మండపం వద్ద ఏదో వెతుకుతూ కనిపించారు. కొంతసేపటికి మండపంలోకి చొరపడి 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.