ఆదిలాబాద్లో గుట్కా స్మగ్లర్ల గ్యాంగ్ వార్.. వీడియో వైరల్
ఆదిలాబాద్లో గుట్కా గ్యాంగ్లు రెచ్చిపోయాయి. అక్రమ వ్యాపారంలో ఆధిపత్యం కోసం నడి రోడ్డుపై రెండు గ్యాంగ్ కొట్టుకున్నాయి. తమపై పోలీసులకు సమాచారం ఇచ్చారన్న కోపంతో మహారాష్ట్ర ముఠాపై ఆదిలాబాద్ గుట్కా గ్యాంగ్ విచక్షణరహితంగా దాడి చేసింది. మహారాష్ట్రలో గుట్కాకు చాలా డిమాండ్ ఉంది. అయితే గుట్కాపై నిషేధం నేపథ్యంలో ఆదిలాబాద్కు చెందిన స్మగ్లర్లు కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకొచ్చి వాటిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
అదిలాబాద్ ముఠా వల్ల తమ దందాకు అడ్డొస్తున్నారని మహారాష్ట్ర ముఠా కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో అదిలాబాద్ ముఠా కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమే రెండు గ్యాంగుల మధ్య గొడవకు కారణమైంది. పోలీసులకు సమాచారం ఇచ్చిన మహారాష్ట్ర ముఠాపై అదిలాబాద్ గుట్కా గ్యాంగ్ దాడికి పాల్పడింది. నడిరోడ్డుపై రెండు గ్యాంగులు వార్తో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగితా ఆరుగురి కోసం గాలిస్తున్నారు.