కాంగ్రెస్ ఒక్కరిని తీసుకెళ్తే.. బీఆర్ఎస్లోకి 10మంది వస్తారు : గంగుల
X
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్తోనే ఉంటారని.. కాంగ్రెస్లోకి వెళ్లరని చెప్పారు. కాంగ్రెస్ మా వాళ్లను ఒక్కరిని తీసుకెళ్తే.. బీఆర్ఎస్లోకి 10మంది వస్తారన్నారు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తమకు అధికారం ముఖ్యం కాదని.. ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు.
తమకు ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్ధేశ్యం లేదని.. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని గంగుల అన్నారు. చాలా మంది రైతులకు ఇంకా రైతు బంధు రాలేదని.. వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి చేసిందేమి లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వినోద్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.