మాదాపూర్ హోటళ్లో పేలిన గ్యాస్ సిలిండర్లు..
Mic Tv Desk | 12 Jun 2023 7:12 PM IST
X
X
మాదాపూర్ పీఎస్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. మాదాపూర్ లోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో.. ఒకదాని తర్వాత ఒకటి రెండు సిలిండర్లు పేలాయి. పెద్ద శబ్దంతో పేలుడు జరగగా.. ఆ టైంలో హోటల్లో ఉన్న కస్టమర్లు, సిబ్భంది ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు బయాందోళకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రణహాని జరగలేదు.
ఈ ఘటనతో హోటల్ పూర్తిగా దగ్ధం అయింది. పేలుడు జరిగిన తర్వాత అప్రమత్తమైన సిబ్బంది.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Updated : 14 Jun 2023 5:25 PM IST
Tags: telangana hyderabad madhapur sainagar cylinder blast in hotel latest news telugu news ayyappa society
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire