Home > తెలంగాణ > ఎన్టీఆర్లాగే ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు: రేవంత్ భార్య గీత

ఎన్టీఆర్లాగే ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు: రేవంత్ భార్య గీత

ఎన్టీఆర్లాగే ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు: రేవంత్ భార్య గీత
X

పతనమవుతున్న కాంగ్రెస్ పార్టీని పైకి లేపి.. రాష్ట్రంలో అధికారం చేపట్టేలా చేసిన రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎంను చేసింది. డిసెంబర్ 7న తెలంగాణ మూడో సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏబీవీపీ నాయకుడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్.. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎంపీగా తన సేవలందించి, సీఎం పదవి వరకు ఎదిగారు. కాగా రేవంత్ ను ముఖ్యనేతలంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ సతీమణి గీత ఇంటర్వూ వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డిని టీడీపీ వ్యవస్తాపకులు దివంగత ఎన్టీఆర్ తో పోల్చారు. ఎన్టీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా ఉంటారని చెప్పారు. ఎప్పుడూ ప్రజలకు మేలు చేయాలనే తపన, ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. ఈ రెండూ ఎన్టీఆర్ లో కనిపించేవని చెప్పారు. ఓ పని మొదలుపెడితే అది కచ్చితంగా తాను చేయగలనని రేవంత్ నమ్ముతారని గీత వివరించారు.

రేవంత్ రెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆయన వాక్ చాతుర్యం. ప్రెస్ మీట్ పెట్టినా, అసెంబ్లీలో మాట్లాడినా రేవంత్ రెడ్డి అనర్గళంగా మాట్లాడతారు. తన ప్రశ్నలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారు. అయితే, ఆ వాగ్ధాటి ఏదో యథాలాపంగా వచ్చింది కాదని గీత అన్నారు. ఏదైనా మీటింగ్ ఉంటే.. దానికి ముందు రోజు రాత్రి రేవంత్ ఆ విషయంపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారట. క్లీయర్ గా అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆయా అంశాలపై ఉన్న సమాచారాన్ని ఆయన బాగా చదువుతారని గీత చెప్పారు. అవసరమైతే అప్పుడప్పుడు తాను కూడా రన్నింగ్ నోట్స్ వంటివి తయారుచేసి సాయం చేస్తుంటానని చెప్పుకొచ్చారు.

Updated : 5 Dec 2023 9:01 PM IST
Tags:    
Next Story
Share it
Top