Home > తెలంగాణ > GHMC : జీహెచ్ఎంసీలో కీలక అధికారుల బదిలీలు.. ఎట్టకేలకు ఆమె ట్రాన్స్ఫర్

GHMC : జీహెచ్ఎంసీలో కీలక అధికారుల బదిలీలు.. ఎట్టకేలకు ఆమె ట్రాన్స్ఫర్

GHMC : జీహెచ్ఎంసీలో కీలక అధికారుల బదిలీలు.. ఎట్టకేలకు ఆమె ట్రాన్స్ఫర్
X

జీహెచ్‌ఎంసీలో కీలక అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌ వి.మమతపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా నియమించారు. మమత స్థానంలో కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అభిలాష అభినవ్‌ కు బాధ్యతలు అప్పగించారు. మమత 2010 నుంచి జీహెచ్ఎంసీలోనే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఓ సారి ఆమె ట్రాన్ ఫర్ చర్చనీయాంశం అయ్యింది. ట్రాన్స్ఫర్ అయిన ఒక రోజులోనే ఆమె తిరిగి కూకట్ పల్లి జోనల్ కమిషనర్గా అప్పటి సర్కార్ నియమించింది.

అదేవిధంగా జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని సైతం ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. జీహెచ్‌ఎంసీలో శ్రీనివాస్ రెడ్డి డిప్యుటేషన్‌ను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది. ఆయన్ని తిరిగి చేనేత, జౌళీ శాఖ అదనపు డైరెక్టర్‌గా నియమించింది. ఆయన స్థానంలో శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ స్నేహ శబరీష్కు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వెంకటరమణను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటరమణ మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్‌ఈగా ట్రాన్స్ఫర్ చేసింది. మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ మల్లికార్జునుడును ఈఎన్‌సీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Updated : 6 Jan 2024 5:16 PM IST
Tags:    
Next Story
Share it
Top