Home > తెలంగాణ > సీఎం రేవంత్ను కలిసిన GHMC మేయర్.. పార్టీ మార్పుకు కాదట?

సీఎం రేవంత్ను కలిసిన GHMC మేయర్.. పార్టీ మార్పుకు కాదట?

సీఎం రేవంత్ను కలిసిన GHMC మేయర్.. పార్టీ మార్పుకు కాదట?
X

అధికార కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నేతలు ఒక్కరొక్కరుగా కలుస్తున్నారు. దీంతో అధిష్టానంలో గుబులు మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో గెలవాలని బీఆర్ఎస్ చూస్తుంటే.. పలువురు నేతలు పార్టీ మారుతున్నారు. ఇంకొందరు అధికార పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి.. శనివారం (ఫిబ్రవరి 3) సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు కొందరు సీఎం రేవంత్ తో సమావేశం అవ్వగా.. మరికొందరు త్వరలో బేటీ కానున్నట్లు ప్రకటించేసరికి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి విజయ లక్ష్మి అభినందనలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్ పై చర్చించినట్లు మేయర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలని సీఎంను మేయర్ కోరారు. ఈ అంశాల పై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, GHMC అభివృద్ధికి తోర్పడాలని మేయర్ స్పష్టం చేశారు.

Updated : 3 Feb 2024 10:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top