Gidugu RudraRaju: ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా
X
ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు... రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అందజేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల(YS Sharmila)కు పీసీసీ పదవి ఇచ్చే అవకాశముంది. పార్టీలో చేరిన తర్వాత YS షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు నేటితో తెరపడినట్టు అయింది. ఆమెకు APCC చీఫ్ పదవి ఇస్తారని ప్రచారమైతే జరుగుతోంది. అందులోభాగంగా గిడుగు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. నిన్న (ఆదివారం) మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.