గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ భేటీ.. సమస్యల పరిష్కారానికి హామీ
X
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎంకు గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. అయితే గిగ్ వర్కర్ల సమస్యలన్నీ తీరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాగా గిగ్ వర్కర్లకు రూ. 10 లక్షల ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ప్రమాద బీమా వర్తింపజేస్తామని చెప్పారు. గిగ్ వర్కర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గిగ్ వర్కర్స్‌తో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిగ్ వర్కర్లను ఆదుకుంటామని అప్పుడు ఆయన హామీ ఇచ్చారు. రాహుల్ హామీ మేరకు మేరకు సీఎం రేవంత్‌రెడ్డి గిగ్ వర్కర్లను కలిసి సమస్యలసై చర్చించారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు.