Home > తెలంగాణ > 50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్
X

గోదావరి ఎక్స్ ప్రెస్ నేటితో ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. అప్పట్లో ఈ రైలును హైదారాబాద్-వాల్తేరు మధ్య నడిపారు. ప్రస్తుతం విశాఖ, హైదరాబాద్ మధ్య నడుస్తోంది. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో నడిచిన గోదావరి ఎక్స్ ప్రెస్ కాలక్రమంలో డీజిల్ ఇంజిన్ తోనూ పరుగులు తీసింది. కాగా, ఈ రైలు సిల్వర్ జూబ్లీ వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైలును అందంగా ముస్తాబు చేశారు. ఈ సాయంత్రం విశాఖలో గోదావరి ఎక్స్ ప్రెస్ బయల్దేరే ముందు ప్రజలు, రైల్వే శాఖ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.

హైదరాబాద్ వరకు ఈ ఎక్స్ ప్రెస్ ఆగే ప్రధాన స్టేషన్లలో ఇలాగే వేడుకలు జరపనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్లతో విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య నడుస్తుంది. 1974 ఫిబ్రవరి 1వ తేదీన మొదటి సారిగా ప్రారంభించిన గోదావరి ఎక్స్ ప్రెస్ వాల్తేర్ – సికింద్రాబాద్ మద్య ట్రైన్ నంబర్ 7007గా, సికింద్రాబాద్ – వాల్తేరు మద్య ట్రైన్ నంబర్ 7008గా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ ట్రైను 18 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు (440 మైల్స్). సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు. 17 భోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలో మీటర్లు (35 మైల్ ఫర్ అవర్)తో ప్రయాణిస్తుంది. ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనతను గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు సాధించింది.

Updated : 1 Feb 2024 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top