Home > తెలంగాణ > భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..?

భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..?

భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..?
X

ప్రస్తుత కాలాన్ని బంగారానికి అన్సీజన్గా చెబుతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఎక్కువగా ఉండకపోవడంతో ధరలు తక్కువగా ఉంటాయి అంటారు. కానీ దానికి రివర్స్గా బంగారం ధరలు అందరికీ షాకిస్తున్నాయి. అన్సీజన్లోనూ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు.. ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి.

గత రెండు రోజలుగా బంగారం ధరలు సుమారు 400రూపాయలు తగ్గాయి. కానీ ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 330 రూపాయలు పెరగ్గా.. 22క్యారెట్ల గోల్డ్ 300 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 60,490 రూపాయలు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 55,450 గా ఉంది. అటు వెండి కూడా ప్రజలకు షాకిస్తోంది. గత రెండు రోజులు తగ్గిన వెండి ధరలు.. ఇవాళ భారీగా పెరిగాయి.

కేజీ వెండి ధర ఇవాళ ఏకంగా 1100 రూపాయలు పెరిగింది. నిన్న కేజీ వెండి ధర 80,400 ఉండగా.. ఇవాళ 81,500 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 55,600గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 60,640గా ఉంది. అయితే ఢిల్లీలో వెండి ధరలు హైదరాబాద్ కన్నా తక్కువగా ఉన్నాయి. అక్కడ కేజీ వెండి ధర 78,400 రూపాయలుగా ఉంది.

వడ్డీ రేట్లను పెంచిన ఫెడ్

మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్‌ వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న ఫెడరల్ ఫండ్స్ రేట్ 5.50 శాతానికి చేరింది. 2001 నుంచి అంటే గత 22 ఏళ్లలో వడ్డీ రేటు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. వడ్డీరేటు పెంపుతో ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతోందని... అందుకే మరోసారి వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడ్ అధికారులు చెబుతున్నారు.

Updated : 27 July 2023 11:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top