Home > తెలంగాణ > సామాన్యులకు గుడ్ న్యూస్...ఈ రోజే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లక్కీ డ్రా

సామాన్యులకు గుడ్ న్యూస్...ఈ రోజే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లక్కీ డ్రా

సామాన్యులకు గుడ్ న్యూస్...ఈ రోజే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లక్కీ డ్రా
X

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రజలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. తమ కొత్త ఇళ్లకు గృహ ప్రవేశం చేసే ఘడియలు రానే వచ్చాయి. ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందేందుకు అర్హులైన 12వేల మంది అదృష్టవంతుల జాబితా ఇవాళ విడుదల కానుంది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌‎లోని ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది చొప్పున 60వేల మందితో లిస్టును రెడీ చేశారు. వీరిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మందిని సెలెక్ట్ చేస్తారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికి చేయాలనే ఉద్దేశంతోనే లక్కీ డ్రా విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. అయితే లక్కీ డ్రా అంటే పేర్లు, నంబర్లు ఓ డబ్బాలో వేసి లక్కీ డ్రా తీయడం కాకుండా ర్యాండమైజేషన్ సాఫ్ట్‎వేర్ ద్వారా లక్కీ డ్రా నిర్వహించనున్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో పూర్తి చేశారు రెవెన్యూ అధికారులు. లబ్ధిదారుల పేర్లు క్లియర్‎గా కనిపించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెరలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ లక్కీ డ్రాలో మినిస్టర్స్ తలసాని, మహమూద్‌ అలీతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు ,జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, మేయర్‌ కూడా పాల్గొననున్నారు.





పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం స్కీమ్‎లో భాగంగా ఉచిత ఇళ్లను పొందేందుకు మూడేళ్ల కిత్రమే అర్హులు అప్లై చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 5వేల నుంచి 10వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి జీహెచ్‌ఎంసీ అధికారులు అర్హులను ఎంపిక చేశారు. లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో 50 శాతం మాత్రమే అధికారులు పరిశీలించారు. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి దశలవారీగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఉండటంతో మిగిలినవాటిని అధికారులు పరిశీలించనున్నారు.




Updated : 24 Aug 2023 3:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top