Home > తెలంగాణ > CM Revanth reddy : తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy : తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy : తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి..సీఎం రేవంత్ రెడ్డి
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలతో భేటీ అయిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేయాలని..అంతేగాక గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.




Updated : 27 Jan 2024 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top