TSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ సర్వీసుల్లో డిస్కౌంట్
X
ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగి అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్ధ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ ట్వీట్టర్ వేదిక వెల్లడించారు. ఏప్రిల్ 30 వరకు ఈ డిస్కౌంట్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు, గోదావరిఖని - బెంగళూరు, కరీంనగర్ - బెంగళూరు, నిజామాబాద్ - తిరుపతి, నిజామాబాద్ - బెంగళూరు, వరంగల్ - బెంగళూరు రూట్లలో అందుబాటులో ఉన్నాయి.
శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చేసింది. వచ్చే నెలలో పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. విద్యార్థులకు హాలిడేస్ వస్తున్నాయంటే కుటుంబసభ్యులు విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వేసవి సెలవులు ఎక్కువ రోజులు ఉంటాయి కనుక ఈ కాలంలో తల్లిదండ్రులు తన పిల్లలతో కలిసి టూర్స్‌కు వెళుతూ ఉంటారు. ప్రముఖ దేవాలయాలతో పాటు అందమైన ప్రదేశాలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువమంది తమ ఫ్యామిలీతో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలానికి వెళుతూ ఉంటారు. అలాంటి వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. నగరం నుంచి శ్రీశైలంకు ఇప్పటివరకు నాన్ ఏసీ బస్సులను మాత్రమే టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. కానీ ఏపీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.