Home > తెలంగాణ > రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్

రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్

రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్
X

తెలంగాణ రైల్వే ప్రయణికులకు గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తన వినతి మేరకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఈ స్టేషన్లు ఉన్నాయని ట్వీటర్ లో ప్రకటించారు.

అయితే అదనపు స్టాపేజీలు సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోనే 9 ఉన్నాయన్నారు. సికింద్రాబాద్‌-భద్రాచలం రోడ్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ తడికలపూడిలో, రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రామన్నపేటలో, గుంటూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉందానగర్‌లో, కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ రేచ్ని రోడ్‌లో, తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ నెక్కొండలో, భద్రాచలం రోడ్‌-సికింద్రాబాద్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ బేతంపూడి స్టేషన్‌లో ఆగనున్నట్లు చెప్పారు. ఇక కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ రాఘవాపురంలో, బల్లార్ష-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ మందమర్రిలో, పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ మంచిర్యాలలో, దౌండ్‌-నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ నవీపేటలో, తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మేడ్చల్‌లో, భద్రాచలం రోడ్‌-బల్లార్ష సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ బేతంపూడిలో, నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబాబాద్‌లో, సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మిర్యాలగూడ మీదుగా ఆగనున్నాయన్నారు. ప్రయాణికులు ఈ అదనపు స్టాపేజీల ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చని కిషన్ రెడ్డి చెప్పారు.

Updated : 9 March 2024 9:55 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top