Home > తెలంగాణ > వారికి గుడ్‌న్యూస్..తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

వారికి గుడ్‌న్యూస్..తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

వారికి గుడ్‌న్యూస్..తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
X

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్‌లో మంత్రలు చర్చించారు. చర్చల్లో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ, రైతు భరోసా పథకం మార్పు చేర్పులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

కేబినెట్‌లో నారాయణపేట-కొండగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మిలో నెలకు 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపై కేబినెట్‌లో చర్చించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయవిచారణ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ పినాకిని చంద్రబోస్‌ను నియమించినట్లు తెలిపింది. అలాగే విద్యుత్‌ కొనుగోళ్లపై మరో కమిటీ ఏర్పాటు చేయగా, కమిటీ ఛైర్మన్‌గా జిస్టిస్‌ నరసింహారెడ్డిని నియమిస్తున్నట్లు వెల్లడించింది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందులో ముదిరాజ్‌, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, మేరు కార్పొరేషన్లు ఉన్నట్లు సమాచారం. ఈబీసీలకు రెడ్డి కార్పొరేషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాల కసరత్తుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మహిళా శక్తి పథకం కింద 63 లక్షల మంది మహిళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకుంది. వచ్చే 5 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు లక్షకోట్ల ఆర్థిక సాయాన్ని కేబినెట్ ప్రకటించింది.


Updated : 12 March 2024 2:38 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top