Home > తెలంగాణ > Bhatti Vikramarka : మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

Bhatti Vikramarka : మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

Bhatti Vikramarka : మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
X

డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. చాలా కాలం నుంచి శాలరీలు రావడం లేదని ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారని వారికి జీతాలు అందేలా చూస్తానని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు.

అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, రెండో ఏఎన్‌ఎంల వంటి వారికి ప్రతి నెల 1వ తేదీన బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ‌త నాలుగేండ్లుగా ఐటీడీఏలో పాల‌క‌మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌లేద‌ని, ఇప్ప‌ట్నుంచి ప్ర‌తి 3 నెల‌ల‌కు ఒక‌సారి స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్నారు. భ‌ద్రాచ‌లం సీతారామ‌చంద్ర‌స్వామి ఆల‌యం సాక్షిగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు తీపి క‌బురు చెబుతున్నాం. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేసి ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించాం. త్వ‌ర‌లో డ్వాక్రా మ‌హిళలంద‌రికీ వ‌డ్డీ లేని రుణాలు అందిస్తామ‌న్నారు. ఆశా వ‌ర్క‌ర్ల‌కు జీతాలు అందే విధంగా కృషి చేస్తాన‌ని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

Updated : 18 Feb 2024 3:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top