Home > తెలంగాణ > బీఆర్‌ఎస్‌కి వరుస షాక్‌లు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నందకిషోర్ వ్యాస్

బీఆర్‌ఎస్‌కి వరుస షాక్‌లు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నందకిషోర్ వ్యాస్

బీఆర్‌ఎస్‌కి వరుస షాక్‌లు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నందకిషోర్ వ్యాస్
X

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయ. బీఆర్‌ఎస్ గోషామహాల్ బీఆర్‌ఎస్ ఇంఛార్జ్ నందకిషోర్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపించారు. గోషామహల్ నుంచి ఆయన పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. గతంలో 2014లో స్వతంత్ర అభ్యర్థిగా, 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఈ రెండుసార్లు ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. గోషామహాల్‌లో హస్తం పార్టీకి పూర్వవైభవం తీసుకోచ్చాని నందకిషోర్ తెలిపారు.

ఇదే కోవలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. సీఎంతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇప్పటి వరకు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేయనప్పటికీ త్వరలోనే ఉంటుందని తెలిసింది. హైదరాబాద్ జిల్లా కు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల ప్రధాన అనుచరులతో కలిసి సమాలోచన చేశారు. వీరే కాకుండా మరికొంతమంది త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చకుంటారనే ప్రచారం జరుగుతోంది.

Updated : 16 March 2024 5:13 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top