Home > తెలంగాణ > జగన్పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఆఫిడవిట్లో క్రైస్తవుడినని చెప్పుకున్న మనిషిని..

జగన్పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఆఫిడవిట్లో క్రైస్తవుడినని చెప్పుకున్న మనిషిని..

జగన్పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఆఫిడవిట్లో క్రైస్తవుడినని చెప్పుకున్న మనిషిని..
X

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్కు హిందువులపై ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లో క్రిస్టియన్గా చెప్పుకున్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా చేయడం దారుణమన్నారు. టీటీడీ చైర్మన్గా కేవలం హిందువులను మాత్రమే నియమించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలను సర్వనాశనం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

అదేవిధంగా తిరుపతి, శ్రీశైలం దేవాలయాల వద్ద మత మార్పిళ్లు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. తిరుమల ఆలయంలో క్రిస్టియన్లు, శ్రీశైలంలో ముస్లింలు నిండిపోతున్నారని అన్నారు. శ్రీశైలంలో ఆవు మాంసం తినడంతో పాటు మద్యం తాగుతున్నారని.. దానికి తనే సాక్ష్యమని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఏపీలోని హిందువులు మేల్కోవాలని.. లేకపోతే నష్టం తప్పదన్నారు. హిందువుల పోరాటానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

కాగా టీటీడీ కొత్త చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ ఎంపిక చేశారు. భూమన వైఎస్సార్ హయాంలోనూ టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవికాలం మూడు, నాలుగు రోజుల్లో ముగియనుంది. ఆయన 2019 నుంచి చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పాలకమండలిలో ఛైర్మన్తో పాటు 35మంది సభ్యులు ఉన్నారు.


Updated : 8 Aug 2023 4:29 PM IST
Tags:    
Next Story
Share it
Top