ఎన్నికల్లో పోటీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. గోషామహల్ బీజేపీ టికెట్ వేరే వ్యక్తికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాజాసింగ్ పార్టీ మారుతారనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. బీజేపీ నుంచే ఎన్నికల బరిలో ఉంటానని చెప్పారు. తన ప్రాణం పోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరను అని స్పష్టం చేశారు.
బీజేపీ అధిష్ఠానం తనపై విధించిన సస్పెన్షన్‌ను సరైన సమయంలో ఎత్తివేస్తుందని రాజాసింగ్ తెలిపారు. ఒక వేళ అలా జరగకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీలో ఉండడని చెప్పారు. తెలంగాణను హిందూ రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉందని.. వారి నిర్ణయం కోసం బీఆర్ఎస్ టికెట్ పెండింగ్ పెట్టిందని రాజాసింగ్ ఆరోపించారు.