MPHA(F) Recruitment : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల పెంపు..
X
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1520 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా మరో 146 పోస్టులను నోటిఫై చేసినట్టు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కొత్త వాటితో కలుపుకొని భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య 1,666కి పెరిగిందని అన్నారు. అభ్యర్థుల వయో పరిమితిని సైతం పెంచుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న ఏజ్ లిమిట్ను 44 ఏండ్ల నుంచి 49 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు సర్వీస్ వెయిటేజీ కింద ఇచ్చే మార్కులను 20 నుంచి 30కి పెంచుతున్నట్టు హరీశ్ రావు ట్వీట్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
దరఖాస్తు తేదీ
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25 ఉదయం 10.30గంటల నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లో లాగినై అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 19 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.
విద్యార్హత
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంబ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలంగాణ స్టేట్ నర్సెస్, మిడ్ వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సులో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సు కంప్లీట్ చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి
అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 49 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేండ్ల చొప్పున వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
అప్లికేషన్ ఫీజు
అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు కింద రూ.500. ప్రాసెసింగ్ ఫీజు రూపంలో అదనంగా మరో రూ.200ల చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.