రాష్ట్రంలో కొత్తగా 3 మండలాలు.. ప్రైమరీ నోటిఫికేషన్ జారీ..
X
తెలంగాణలో కొత్తగా మరో 3 మండలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోపు చెప్పాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మండలాల్లో రెండు నిర్మల్ జిల్లాలో ఉండగా.. మరొకటి వనపర్తిలో ఏర్పాటు కానుంది. వనపర్తి జిల్లాలోని చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలతో కలిపి ఏదుల మండలాన్ని ప్రతిపాదించారు.
ఇక నిర్మల్ జిల్లాలో మాలెగావ్, బెల్తారోడాను మండలాలుగా ఏర్పాటు చేయనుంది. మలేగావ్ మండలంలో సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి(బి), మోలా, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిఘ్వా, మాలేగావ్, గోదాపూర్, కుప్టి, వర్ని గ్రామాలను కలపనున్నారు. 12 గ్రామాలతో బెల్తాడోరా మండలం ఏర్పాటును ప్రతిపాదించింది. అందులో ఝరి (కే), వాజ్హరి, బోల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర గ్రామాలు చేర్చారు.