Home > తెలంగాణ > ట్రాఫిక్ చలాన్లపై కీలక నిర్ణయం.. గడువు పొడగింపు..?

ట్రాఫిక్ చలాన్లపై కీలక నిర్ణయం.. గడువు పొడగింపు..?

ట్రాఫిక్ చలాన్లపై కీలక నిర్ణయం.. గడువు పొడగింపు..?
X

రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ స్కీం ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ గడువును పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 25 వరకు పెండింగ్ లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. గత డిసెంబర్ 26 నుంచి ఈ స్కీం అందుబాటులోకి తెచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా డిస్కౌంట్ స్కీం నేపథ్యంలో ఇప్పటి వరకు 1.14కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అత్యధికంగా 66.57 లక్షల చలాన్లు చెల్లించినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 2.45 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించేందుకు వాహనదారులు ప్రయత్నిస్తుండటంతో సర్వర్ పై ఒత్తిడి పెరిగిన ఈ-చలాన్‌ సైట్‌ ఓపెన్‌ కావడంలేదు. ఫలితంగా చలాన్లు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో డిస్కౌంట్ గడువును పొడిగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ క్రమంలో మరో వారం రోజుల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాయంత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Updated : 10 Jan 2024 1:16 PM IST
Tags:    
Next Story
Share it
Top