Home > తెలంగాణ > తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సందేశం

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సందేశం

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సందేశం
X

తెలంగాణలో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. ‘‘అందరికీ నమస్కారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను’’ అని గవర్నర్ అన్నారు.


Updated : 29 Nov 2023 4:57 PM IST
Tags:    
Next Story
Share it
Top