తెలంగాణ ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
X
తెలంగాణ గవర్నర్ బాధ్యతల్ని రాష్ట్రపతి ఎవరికి అప్పగిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ఝార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల్ని కూడా అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ గవర్నర్ నజీర్‌కు పక్క తెలుగు రాష్ట్రం బాధ్యతల్ని ఇస్తారని తొలుత వార్తలు వచ్చాయి. గవర్నర్ తమిళిసై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో కొత్త గవర్నర్ ను నియమించారు.
తమిళనాడు నుంచి తమిళిసై బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.