Home > తెలంగాణ > Governor Tamilisai : పీచు మిఠాయిని నిషేధిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు (వీడియో)

Governor Tamilisai : పీచు మిఠాయిని నిషేధిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు (వీడియో)

Governor Tamilisai : పీచు మిఠాయిని నిషేధిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు (వీడియో)
X

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదిచ్చేరిలో పీచు మిఠాయి (కాటన్ క్యాండీ) విక్రయాలపై నిషేధం విధిస్తూ ప్రకటించారు. విషపూరిత రసాయనాలు వినియోగించి పీచు మిఠాయి తయారుచేస్తున్నారనే కారణంగా.. వీటిపై తమిళిసై నిషేధం విధించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసి.. ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా.. పీచు మిఠాయిని రోడోమైన్ బీ అనే రసాయనంతో తయారుచేస్తున్నారు. ఈ రసాయనం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తమిళిసై చెప్పుకొచ్చారు. అందుకే పుదుచ్చేరిలో పీచు మిఠాయి విక్రయాన్ని నిలిపేస్తున్నాట్లు తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు గవర్నర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియో సందేశం పంచుకున్నారు. పీచు మిఠాయిలు కొనుగోలు చేయడం ఆపేయాలని, పిల్లలు మారాం చేసినా వినకూడదని తమిళిసై సూచించారు. అందులోని రసాయనాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అందులో రోడమైన్ బీ కెమికల్ ను అధికారులు కనుగొనగా.. పీచు మిఠాయి విక్రయించే అన్ని దుకాణాలు తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను తమిళిసై ఆదేశించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం.. రోడోమైన్ కెమికల్ ను ఫుడ్ లో రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణం అవుతుందని తమిళిసై చెప్పారు. ఫలితంగా లివర్ ఫెయిల్యూర్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

Updated : 12 Feb 2024 10:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top