Home > తెలంగాణ > Run for Girl Child : ఉత్సాహంగా ‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌.. ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

Run for Girl Child : ఉత్సాహంగా ‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌.. ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

Run for Girl Child : ఉత్సాహంగా ‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌.. ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
X

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ కార్యక్రమాన్ని గవర్నర్ తమిసై సౌందరరాజన్‌ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఐటీ ఉద్యోగులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి రన్‌ ప్రారంభమై.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది.సెంట్రల్ యూనివర్సిటీ వరకు 5 కిలో మీటర్లు కొనసాగింది. అక్కడి నుంచి హెచ్‌సీయూ మీదుగా 10, 21 కిలో మీటర్ల రన్ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. తక్కువ ఆదాయ ప్రాంతాలలో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభిద్ధికి తోడ్పాటు అందిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు. సేవా భారతి ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆడపిల్లల చదువుకు విరాళాల సేకరణ కోసం ఈ కార్యక్రమం చేపట్టామని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6700 మంది లబ్ధిదారులతో 300 కిషోరి వికాస్‌ కేంద్రాలు పని చేస్తున్నాయని.. ఈ రన్‌ ద్వారా మరో 500 కేంద్రాలను విస్తరించి లబ్ధిదారులను 10వేలకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 300 కిషోరి వికాస్ కేంద్రాలు హైదరాబాద్ మురికివాడల్లో సుమారు 6700 మంది లబ్ధిదారులతో చురుకుగా పని చేస్తున్నాయని, ఈ రన్ ద్వారా మరో 500 కేంద్రాలను విస్తరిస్తూ పది వేల లబ్ది దారులకు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.

Updated : 11 Feb 2024 1:11 PM IST
Tags:    
Next Story
Share it
Top