Governor Tamilisai: కేసీఆర్ సర్కార్పై గవర్నర్ ఉగ్రరూపం
X
తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య పెరిగిన దూరం.. ఈ మధ్యే తగ్గుతుంది అనుకున్న టైంలో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నేతలు గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ముర్ము ఆమోదించిన నేపథ్యంలో.. ఇవాళ రాజ్భవన్లో మహిళలతో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో మాట్లాడిన తమిళసై.. తాను తెలంగాణకు గవర్నర్ అయిన సందర్భంలో కేబీనెట్ లో ఒక్క మహిళా మంత్రి లేరని, తాను వచ్చాకే ఇద్దరు మంత్రులు కావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతా అని స్పష్టం చేశారు. తనపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటానని, తనపై దాడి చేసి గాయపరిచే.. ఆ రక్తాన్ని సిరాగా మార్చి తన చరిత్ర రాసుకుంటానని అన్నారు తమిళసై. మహిళలంతా అలానే ఉండాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని, హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా కోరారు. రాజకీయాలపై ఇష్టంతోనే కష్టపడి చదివిన డాక్టర్ వృత్తిని వదిలినట్లు చెప్పుకొచ్చారు.