Governor Tamilisai : అమిత్‌షాను కలిసిన గవర్నర్ తమిళిసై
X
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. అమిత్ షాకు రాష్ట్ర పరిస్థిని వివరించినట్లు తమిళిసై చెప్పారు. కాగా తెలంగాణలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వంతో గవర్నర్ సఖ్యతగానే ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్నింటా గవర్నర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు గవర్నర్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను వెంటనే క్లియర్ చేస్తున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా రేవంత్ కేబినెట్ ప్రతిపాదించిన కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల ఫైల్కు గవర్నర్ వెంటనే పచ్చజెండా ఊపారు. అయితే బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లడంతో వారి ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. గతంలో బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. గవర్నర్పై బీఆర్ఎస్ బహిరంగ ఆరోపణలు చేసింది. బీజేపీ నేతగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ చాలాసార్లు విమర్శలు గుప్పించారు. అటు గవర్నర్ సైతం బీఆర్ఎస్ తెచ్చిన పలు బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.