Home > తెలంగాణ > ప్రభుత్వ వివరణపై గవర్నర్ సంతృప్తి.. రాత్రిలోగా బిల్లుకు ఆమోదం..!

ప్రభుత్వ వివరణపై గవర్నర్ సంతృప్తి.. రాత్రిలోగా బిల్లుకు ఆమోదం..!

ప్రభుత్వ వివరణపై గవర్నర్ సంతృప్తి.. రాత్రిలోగా బిల్లుకు ఆమోదం..!
X

తెలంగాణలో ఆర్టీసీ బిల్లుపై సీఎం వర్సెస్ గవర్నర్గా పరిస్థితి మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుని.. ఆ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపించారు. అయితే ఆ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ వివరణను కోరారు. ఈ క్రమంలో గవర్నర్కు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వివరణపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న ఆమె.. సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టీసీ బిల్లుకు ఆమెదం తెలిపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంలో ఎన్నో ట్విస్టులు చోటచేసుకున్నాయి. ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదానికి ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపగా.. ఆమె కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఆ సందేహలపై వివరణ ఇచ్చింది.

ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. ఆర్టీసీ కార్పొరేషన్ అలాగే ఉంటుందని ప్రభుత్వం గవర్నర్కు తెలిపింది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని చెప్పింది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీతాలు, కేడర్‌, ప్రమోషన్లకు ఎలాంటి సమస్య ఉండదని వివరించింది.

అంతకుముందు గవర్నర్ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీసీ యూనియన్ నేతలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గవర్నర్ తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ యూనియన్ లీడర్ థామస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వివరణ ఇంకా తనకు అందలేదని.. అది అందగానే బిల్లును ఆమోదిస్తానని చెప్పారన్నారు. కార్మికుల ప్రయోజనాలకు తాను వ్యతిరేకం కాదని.. అసెంబ్లీ సెషన్ అయ్యేలోపే బిల్లును ఆమోదించేలా చూస్తానని తమిళిసై హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.


Updated : 5 Aug 2023 10:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top