Home > తెలంగాణ > తొలిసారి సెక్రటేరియట్లోకి గవర్నర్.. నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు

తొలిసారి సెక్రటేరియట్లోకి గవర్నర్.. నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు

తొలిసారి సెక్రటేరియట్లోకి గవర్నర్.. నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు
X

సెక్రటేరియట్ ఆవరణలోని నల్లపోచమ్మ ఆలయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యాయి. సచివాలయానికి చేరుకున్న గవర్నర్కు సీఎం కేసీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. అనంతరం బ్యాటరీ కారులో ఆలయానికి తీసుకెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు.





నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చర్చి ప్రారంభోత్సవానికి వెళ్లారు. చర్చి ఓపెనింగ్ అనంతరం అక్కడ కేక్ కట్ చేశారు. ఆ తర్వాత గవర్నర్, ముఖ్యమంత్రి మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారి సహా పలువురు హాజరయ్యారు.




Updated : 25 Aug 2023 1:13 PM IST
Tags:    
Next Story
Share it
Top