Home > తెలంగాణ > ఇచ్చిన హామీలను నిలుపుకోండి.. గవర్నర్ తమిళిసై ట్వీట్

ఇచ్చిన హామీలను నిలుపుకోండి.. గవర్నర్ తమిళిసై ట్వీట్

ఇచ్చిన హామీలను నిలుపుకోండి.. గవర్నర్ తమిళిసై ట్వీట్

ఇచ్చిన హామీలను నిలుపుకోండి.. గవర్నర్ తమిళిసై ట్వీట్
X





రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎన్నో శతాబ్ధాల చరిత్ర కలిగిన ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదంటూ గవర్నర్.. ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ పేరుతో ఉన్న ఓ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. మొదటి పోస్ట్‌లో.. రోగులతో నిండి ఉన్న హాస్పిటల్ లోని జనరల్ వార్డులను, బయటి వైపు ఉన్న టాయిలెట్, డ్రైనేజ్ సిస్టమ్ ఫోటోలను షేర్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని ఆ ట్వీట్ లో తెలిపారు.




‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ చేసిన ట్వీట్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రీట్వీట్‌ చేస్తూ ఆస్పత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందన్నారు. ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.




Updated : 28 Jun 2023 1:25 PM IST
Tags:    
Next Story
Share it
Top