Governor TamiliSai : వైభవంగా సాగుతున్న జనజాతర...అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ తమిళి సై
X
మేడారం మహాజాతర వైభవోపేతంగా సాగుతుంది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఈ జనజాతరకు ఇసుకేస్తే రాలనంత మంది జనం తరలివస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం గద్దెపైకి సమ్మక్క చేరుకొవడంతో అమ్మవారిని దర్శనం చేసుకొని భక్తులు పరవశించిపోతున్నారు. మేడారంలో అతి కీలకమైన ఘట్టమైన ఇవాళ నలుగురు దేవతలు గద్దెలపై కోలువుదీరి భక్తులకు
దర్శనమిస్తున్నారు. వనదేవతల దర్శానికి తండోపతండాలుగా భక్తులు ఎగబడుతున్నారు. జంపన్న వాగులో స్నానం ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎక్కడికక్కడ సమీక్షిస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అమ్మవారి సేవలో గవర్నర్..
మేడారం మహాజాతర మూడో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. డప్పు చప్పులు, డోలు వాయిద్యాల నడుమ మేడారం పరిసర ప్రాంతాలన్నీ కోలహలంగా మారాయి. జై సమ్మక్క, జై సారలమ్మ అంటూ అమ్మవార్ల నామస్మరణతో మేడారం దద్దరిల్లుతోంది. ఇటు గద్దెలపై కోలువుదీరిన వనదేవతలను దర్శించుకున్నారు గవర్నర్ తమిళి సై. నిలువెత్తు బంగారం..అమ్మవార్లకి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. గవర్నర్ తమిళి సైతో పాటు కేంద్ర మంత్రి అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అంతముందు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన గవర్నర్, కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు.