Home > తెలంగాణ > TSRTC:ఆర్టీసీ బిల్లుపై మళ్లీ లొల్లి.. గవర్నర్‌ మరో ట్విస్ట్.. కార్మికులకు షాక్

TSRTC:ఆర్టీసీ బిల్లుపై మళ్లీ లొల్లి.. గవర్నర్‌ మరో ట్విస్ట్.. కార్మికులకు షాక్

TSRTC:ఆర్టీసీ బిల్లుపై మళ్లీ లొల్లి.. గవర్నర్‌ మరో ట్విస్ట్.. కార్మికులకు షాక్
X

టీఎస్ఆర్టీసీ కార్మికుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య.. ఈ బిల్లు అసెంబ్లీకి చేరుకుని పాస్ అయ్యింది. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీతో ఆమోదించిన బిల్లులకు రాజ్‌భవన్‌ ఆమోద్రముద్ర వేయడం, ఇక విలీనమే తరువాయి అనుకునే సమయంలో గవర్నర్ తమిళిసై మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బిల్లుపై న్యాయ సలహా కోరారు. బిల్లు విషయంలో ఉన్న తన అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు బిల్లును న్యాయశాఖకు పంపించారు. దాంతోపాటు కొద్ది నెలలుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య తిరుగుతున్న మరో నాలుగు బిల్లులను కూడా మరోసారి న్యాయశాఖ పరిశీలనకు పంపారు.

దీంతో న్యాయశాఖ కార్యదర్శి చేసే సిఫార్సుల ఆధారంగా ఆర్టీసీ బిల్లుపై తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపినట్లు.. రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు ఇతరత్రా వార్తలు వస్తున్న తరుణంలో మీడియాకు ప్రకటన విడుదల చేస్తున్నట్లు వివరించింది. దురుద్దేశంతో చేస్తున్న అసత్యాలు, నిరాధార ప్రచారంతో ఆందోళనకు గురికావద్దని ప్రజలు, ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగులకు రాజ్​భవన్ విజ్ఞప్తి చేసింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ప్రతీ బిల్లునూ క్షుణ్ణంగా పరిశీలించి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ప్రభుత్వం సంతృప్తికరమైన సమాచారం ఇచ్చే వరకు బిల్లులు పెండింగ్‌లో ఉంచుకునే విషయంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అదే సమయంలో తాను లేవనెత్తిన సందేహాలన్నీ ప్రభుత్వం విధిగా శాసనసభ, శాసనమండలి సభ్యుల దృష్టికి తీసుకెళ్లిందా? లేదా? అనే అంశాన్ని కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 175(2) ద్వారా తనకు లభించిన అధికారాన్ని ఉపయోగించి, అసెంబ్లీ స్పీకర్‌, కౌన్సిల్‌ ఛైర్మన్‌లను అడిగి తెలుసుకుంటున్నారు.

Updated : 18 Aug 2023 2:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top