Home > తెలంగాణ > Telangana Schools : రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు

Telangana Schools : రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు

Telangana Schools : రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు
X

తెలంగాణ ప్రభుత్వం రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 14,15) స్కూళ్లకు సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 15న టీఎస్ టెట్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ గా నిర్వహించే స్కూళ్లకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 15 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 ఉండగా.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 హాఫ్ డే స్కూల్ ఉంటుంది. టీఎస్ టెట్2023 నోటీఫికేషన్ ఈ ఏడాది ఆగస్ట్ 1న విడుదల అయింది. ఆగస్ట్ 2 నుంచి 16 వరకు అప్లై ఆప్షన్ అందుబాటులో ఉండగా.. మొత్తం 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.




Updated : 13 Sept 2023 6:19 PM IST
Tags:    
Next Story
Share it
Top