Home > తెలంగాణ > మూసీ నదిపై కబ్జాలు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు

మూసీ నదిపై కబ్జాలు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు

మూసీ నదిపై కబ్జాలు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు
X

మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలతో గురువారం (ఆగస్ట్ 17) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల మీద చర్చించారు. వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసినందుకు అధికారులు, సిబ్భందికి దన్యవాధాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మూసీ నదిని మరింత బలోపేతం చేయడం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో జరిగిన కబ్జాలను తొలగిస్తే.. రానున్న రోజుల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గుతుందని అన్నారు.

ప్రస్తుతం మూసీ ప్రాంతాల్లో దుర్బర పరిస్థితుల్లో ఉంటున్నపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై సీరియస్ అయిన కేటీఆర్.. ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వాళ్లకు ఇళ్లు ఇస్తామన్నారు. దీనికోసం సుమారుగా 10వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను వినియోగించనున్నారు. ఆక్రమణలు తొలగించాక మూసీ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.


Updated : 17 Aug 2023 2:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top