Home > తెలంగాణ > కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దు.. బాల్క సుమన్‌

కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దు.. బాల్క సుమన్‌

కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దు.. బాల్క సుమన్‌
X

ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ చెన్నూర్‌ నుంచి మరోసారి పార్టీ అభ్యర్థిగా బాల్క సుమన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం నియోజకవర్గంలో బాల్క సుమన్ ప్రజా ఆశ్వీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జైపూర్‌, భీమారం, కిష్టంపేట మీదుగా చెన్నూర్‌ వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దని అన్నారు. కొందరిని తామే కాంగ్రెస్ పార్టీలోకి పంపామని.. అందరూ మన దగ్గరికే వస్తారని సంచలన కామెంట్స్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటేష్ నేత కూడా తిరిగి బీఆర్ఎస్‌లోకే వచ్చారని కూడా ప్రస్తావించారు. ఆ సమయంలో బాల్క సుమన్ పక్కనే ఉన్న వెంకటేష్ నేత.. రెండు చేతులు పైకెత్తి విన్ సింబల్ చూపెట్టారు.

‘‘కాంగ్రెసోళ్ల విషయంలో మీరు కూడా దయచేసి ఏమనకండి. వాళ్లు అక్కడక్కడ తిరిగుతుంటే.. మనోళ్లు అదోటి ఇదోటి అంటున్నరు. ఏమనకండి.. వాళ్లు కూడా మనోళ్లే. వెంకన్న(వెంకటేష్ నేత) రాలేదా.. వాళ్లందరూ మనోళ్లే. మీకు అసలు విషయం చెప్పాలంటే.. మనమే కొందరిని పంపించినం కూడా.. ఈ విషయం బయట ఎక్కడా చెప్పకుర్రి... రాజకీయాలు అన్నప్పుడు ఇలాంటివి నడుస్తాయ్.. తెలివి తేటలు వాడాలి కదా’’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు.






Updated : 27 Aug 2023 11:26 AM IST
Tags:    
Next Story
Share it
Top