Home > తెలంగాణ > ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..

ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..

ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..
X

మరికొద్దిసేపట్లో అతడి పెళ్లి.. ఇంటి నుంచి పెళ్లి మండపానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఫుల్ ట్రాఫిక్ జాం అయ్యింది. ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లికొడుకు ముహూర్తం దాటిపోతుందని మస్త్ టెన్షన్ పడ్డాడు. చాలాసేపటి తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావడంతో మండపానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా ట్యాంక్ పడడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఈ ట్రాఫిక్లో ఓ పెళ్లికొడుకు కారు చిక్కుకుంది. మరికొద్దిసేపట్లో అతడి పెళ్లి ఉందని అనగా.. ట్రాఫిక్లో ఇరుక్కపోవడంతో అతడు హైరానా పడ్డాడు. కారు దిగి అధికారుల వద్దకు వెళ్లి ముహూర్తం దాటిపోతుందని ట్రాఫిక్ను త్వరగా క్లియర్ చేయాలని కోరాడు.

పెట్రోల్ ట్యాంకర్ ఉండటంతో సమస్య ఏర్పడిందని కాస్త సమయం పడుతుందని అధికారులు సూచించారు. ఇక లాభం లేదనుకున్న పెళ్లికొడుకు వేరే రూట్లో వెళ్లేందుకు కారును వెనక్కి తిప్పి కొంత దూరం వెళ్లాడు. అయితే ట్రాఫిక్ క్లియర్ అయి వాహనాలు వెళ్తుండడంతో తిరిగి వెనక్కి వచ్చి అదే రూట్లో తొర్రూర్ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికొడుకు ఎంత పెద్ద కష్టం వచ్చే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Updated : 7 Sept 2023 6:49 PM IST
Tags:    
Next Story
Share it
Top