Home > తెలంగాణ > ‘Modi surname’ remark defamation case: నేను నిర్ధోషిని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. రాహుల్ గాంధీ

‘Modi surname’ remark defamation case: నేను నిర్ధోషిని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. రాహుల్ గాంధీ

‘Modi surname’ remark defamation case: నేను నిర్ధోషిని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. రాహుల్ గాంధీ
X

ప్రధాని మోదీ ఇంటి పేరు (Modi Surname) పై చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని.. తాను ఎలాంటి నేరానీకి పాల్పడలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. తాను నిర్ధోషినని, ఈ విషయంలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ క్షమాపణ(apologising for no fault) చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే తాను ‘అహంకారి’ అని పూర్ణేష్‌ మోదీ(Purnesh Ishwarbhai Modi) పేర్కొన్నారని తన అఫిడవిట్‌లో తెలిపారు. తప్పు చేయనప్పుడు క్షమాపణలు చెప్పడమంటే న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్టేనన్నారు. తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. తనపై విధించిన శిక్ష నిలబడదని నమ్ముతున్నట్టు చెప్పారు

మోదీ పేరుతో ఎలాంటి వర్గం లేదని అసలు అధికారికంగా మోదీ సమాజం, మోదీ వర్గమనేవి లేనప్పుడు తన వ్యాఖ్యలు ఓ వర్గం మొత్తాన్ని కించపరర్చడమనేది ఉండదన్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మెహుల్ చోక్సీలు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కూడా కాదన్నారు. అందుకే తనపై శిక్ష నిలబడజాలదన్నారు(conviction is unsustainable). తాను శిక్షార్హమైన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, క్షమాపణే చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒక వేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడనని అన్నారు.

కర్ణాటకలో జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ(BJP MLA Purnesh Ishwarbhai Modi) 2019లో రాహుల్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా నిర్దారిస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రాహుల్‌ వయనాడ్ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో సూరత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వేసిన తాజా అఫిడవిట్‌లో రాహుల్ సవాలు చేశారు.




Updated : 3 Aug 2023 5:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top