Home > తెలంగాణ > Group 2 Exam: మరోసారి TSPSC గ్రూప్‌-2 వాయిదా

Group 2 Exam: మరోసారి TSPSC గ్రూప్‌-2 వాయిదా

Group 2 Exam: మరోసారి TSPSC గ్రూప్‌-2 వాయిదా
X

వచ్చే నెలలో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ముందుగా ప్రకటించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ... తాజాగా వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం అధికారంగా టీఎస్‌పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 29, 30వ తేదీల్లోనే పరీక్షలు పూర్తవ్వాల్సి ఉంది.

అయితే అదే సమయంలో మరికొన్ని పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోదని.. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఆందోళనలు చేశారు. దీంతో అప్పటి BRS ప్రభుత్వం నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేసింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నవంబరులో జరగాల్సిన పరీక్షను 2024లో జనవరి 6, 7న నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీయడం టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగా.. టీఎస్‌పీఎస్పీని ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. TSPSC ఛైర్మన్, సభ్యులు రాజీనామాల తరువాత ప్రస్తుత పరిస్థితుల్లో గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం మళ్లీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడడంతో నిరాశకు గురవుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు చేశారు. గ్రూప్-2 మొత్తం ఖాళీల వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 - 11 పోస్టులు, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ - 59, డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌) - 98, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 - 14 ఖాళీలు ఉన్నాయి.అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌) - 63, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ - 09, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి)-126, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్ - 97 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు..అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌) - 38, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) - 165, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ - 15 ఖాళీలు ఉన్నాయి.

Updated : 28 Dec 2023 7:07 AM IST
Tags:    
Next Story
Share it
Top