Home > తెలంగాణ > హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారి కిడ్నాప్..!

హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారి కిడ్నాప్..!

హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారి కిడ్నాప్..!
X

హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారి కిడ్నాప్‌ కలకలం రేపింది. జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్ చేయడానికి వెళ్లగా జీఎస్టీ అధికారిని వ్యాపారులు ఎత్తుకెళ్లారు. అనంతరం అధికారిపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్స్ నుంచి జీఎస్టీ అధికారిని కాపాడారు. ప్రస్తతం నగరంలో ఈ కిడ్నాప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

దిల్‌సుఖ్‎నగర్‌లోని కృష్ణానగర్‌లో జీఎస్టీ కట్టని ఓ స్క్రాప్ గోడౌన్ సీజ్ చేయటానికి ఆఫీసర్‌ మణిశర్మ అక్కడికి వెళ్ళారు. ఈ క్రమంలో మణిశర్మతో షాప్ ఓనర్ కాసేపు వాదించాడు. నకిలీ జీఎస్టీ అధికారులు, సిబ్బంది వచ్చారంటూ హడావిడి చేశారు. అనంతరం అక్కడి నుంచి మణిశర్మతో పాటు మరో అధికారి అనంద్‌ను షాప్‌ ఓనర్‌, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్‌ చేశారు. జీఎస్టీ ఆఫీసర్‌పై వారు దాడికి పాల్పడ్డారు.

స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన అధికారుల నెంబర్లను సేకరించి... సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా గాలింపు చేపట్టారు. చివరికి గోషామహల్ దగ్గర కిడ్నాప్ అయిన జీఎస్టీ ఆధికారుల కారును గుర్తించి వారిని విడిపించారు. కిడ్నాప్‌కు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


Updated : 5 July 2023 4:22 PM IST
Tags:    
Next Story
Share it
Top