Home > తెలంగాణ > Tonique Liquor : టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. కీలక విషయాలు వెలుగులోకి!

Tonique Liquor : టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. కీలక విషయాలు వెలుగులోకి!

Tonique Liquor : టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. కీలక విషయాలు వెలుగులోకి!
X

హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజుల నుంచి జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టానిక్ లిక్కర్ గ్రూప్స్‌ సంస్థలపై విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అదేవిధంగా సంస్థకు లింక్ అయిన కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు సంచలన విషయాలు బయటపడుతుండటంతో.. ఇంకా కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపుకు లేని వెసులుబాటు టానిక్‌ లిక్కర్ గ్రూప్ కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టానిక్‌ గ్రూప్ కు ఏ-4 ఎలైట్ కింద లైసెన్సులను జారీ చేసినట్లుగా కమర్షియల్ టాక్స్ అధికారులు గుర్తించారు. అయితే పాలసీలో ఇలాంటి అనుమతి దృష్టికి రాలేదని పలువురు వైన్ షాపు నిర్వాహకులు వాదనలు వినిపిస్తున్నారు.

అయితే, ఇది ఎక్సైజ్ పాలసీ‌కి పూర్తిగా విరుద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు. అదేవిదంగా టానిక్ గ్రూప్స్ జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అనీత్‌రెడ్డి, అఖిల్‌రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్లు ఉండి నడిపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. టానిక్ లిక్కర్ గ్రూప్ సిండికేట్ కు సంబంధించి బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డిల ప్రమేయం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.




Updated : 5 March 2024 1:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top