Home > తెలంగాణ > తెలంగాణ సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి

తెలంగాణ సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి

తెలంగాణ సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. రాష్ట్ర యాంటి నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా వున్న చక్రవర్తిని తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తూ రాష్ట్ర డిజిపి రవిగుప్తా ఉత్తర్వులు జారీచేసారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని... తదుపరి ఆదేశాలు వెలువడేవరకు సీఎం సెక్యూరిటీ బాధ్యతలు చక్రవర్తి చూసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపిఎస్ అధికారి శివధర్ రెడ్డిని సీఎం రేవంత్ నియమించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి నియమితులయ్యారు.

ఇదిలా ఉండగా.. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఉద్దేశించిన ఈ ప్రజాదర్బార్‌ కార్యక్రమం పేరును తాజాగా ప్రజావాణిగా మార్చారు. పేరు మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం ఒక కార్యక్రమంలో ప్రకటించారు. హైదరాబాద్‌ లోని జ్యోతిబా ఫులె ప్రజాభవన్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమంలో మార్పులు చేసినట్లు సీఎం తెలిపారు. ఇక నుంచి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రజావాణి’లో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు.

Updated : 12 Dec 2023 2:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top