3 రోజుల్లో ఫైనల్ కీ.. నెలాఖరులోగా గురుకుల పోస్టుల ఫలితాలు..
X
గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఫలితాల ఈ నెలఖరులోగా ప్రకటించనున్నారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు 19 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది అప్లై చేశారు. వారిలో సగటున 75.68శాతం మంది పరీక్ష రాశారు. ఎగ్జామ్ కోసం 17 జిల్లాల్లో 104 కేంద్రాల్ని ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల చొప్పున పరీక్ష నిర్వహించారు.
గురుకుల పరీక్షలకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్, అభ్యర్థుల ఆన్సర్ షీట్స్, ప్రిలిమినరీ కీ వెబ్ సైట్ లో పెట్టినట్లు గురుకుల నియామక బోర్డు అధికారులు చెప్పారు. అభ్యర్థులు పర్సనల్ లాగిన్ ద్వారా ఆన్సర్స్ సరిచూసుకోవచ్చని, ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా చెప్పాలని సూచించారు. కేవలం లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాలని, ఈ - మెయిల్ ద్వారా పంపితే స్వీకరించమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే 21, 22, 23 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ గురువారం మధ్యాహ్నానికి అందుబాటులోకి తెస్తామని బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షల ప్రాథమిక కీపై 26వ తేదీ సాయంత్రంలోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుందని చెప్పింది. ఈ నెల 1న జరిగిన ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పరీక్షలపై వివాదం నెలకొనడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు వాటి వాటి ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాల్ని ప్రకటిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం రెండు రోజుల్లోగా తుది కీ ప్రకటించనున్నారు. దాంతో పాటు అభ్యర్థులకు వచ్చిన మార్కులను వెల్లడించనున్నారు. తొలుత డిగ్రీ, జూనియర్ లెక్చరర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైన అనంతరం పీజీటీ, టీజీటీ పోస్టుల ధ్రువపత్రాలు పరిశీలించి అక్టోబర్ కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది.