Home > తెలంగాణ > కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు - గుత్తా సుఖేందర్

కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు - గుత్తా సుఖేందర్

కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు - గుత్తా సుఖేందర్
X

రాష్ట్రాల హక్కులను కేంద్రం చేతుల్లోకి పోయేలా ఆంధ్ర ప్రభుత్వం కుట్ర చేసిందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున సాగర్ డ్యాంపైకి పోలీసులు దౌర్జన్యంగా రావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వం దుస్సాహసం చేసిందన్న ఆయన.. దురాలోచనతోనే ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్య అని గుత్తా అన్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో శ్రీశైలం, తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో నాగార్జున సాగర్ ఉండాలని చెప్పారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సాగర్‌ను దురాక్రమించడం సరికాదని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుడి కాలువకు నీటి విడుదల ఆపాలని కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

ఎగ్జిట్ పోల్స్పైనా గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. అవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.

Updated : 2 Dec 2023 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top