Home > తెలంగాణ > Gutha Sukender Reddy : ఆ టికెట్ ఇవ్వకుంటే పార్టీ వీడుతా.. బీఆర్ఎస్కు గుత్తా అల్టిమేటం..

Gutha Sukender Reddy : ఆ టికెట్ ఇవ్వకుంటే పార్టీ వీడుతా.. బీఆర్ఎస్కు గుత్తా అల్టిమేటం..

Gutha Sukender Reddy : ఆ టికెట్ ఇవ్వకుంటే పార్టీ వీడుతా.. బీఆర్ఎస్కు గుత్తా అల్టిమేటం..
X

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అలకబూనారు. తన డిమాండ్లు పట్టించుకోవడంలేదన్న కారణంతో పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్లో నల్గొండ పార్లమెంట్ సమీక్షా సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశానికి గుత్తా హాజరుకాలేదు.

సార్వత్రిక ఎన్నికల్లో తన కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వాలని గుత్తా సుఖేందర్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తన కొడుకుకు కాకుండా వేరెవరినైనా ఆ స్థానం నుంచి బరిలో నిలిపితే బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతానని అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగింపులకు దిగినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీశ్ రావు సాయంత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌‌ ఎన్నికల్లో తన కొడుకు అమిత్ రెడ్డి పోటీ చేస్తాడని గుత్తా ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. భవనగిరి, నల్గొండలో ఏదో ఓ స్థానం నుంచి బరిలో ఉంటాడని స్పష్టం చేశారు. నిజానికి కేటీఆర్ సూచనతో రాజకీయాల్లోకి వచ్చిన అమిత్కు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తనకు టికెట్ ఇస్తారని భావించారు. మునుగోడు, నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఉమ్మడి జిల్లాలో 12 మంది సిట్టింగ్​లనే కేసీఆర్ మళ్లీ అవకాశమివ్వడంతో ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో అయినా టికెట్ ఇవ్వాలని గుత్తా డిమాండ్ చేస్తున్నారు.




Updated : 22 Jan 2024 10:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top