హైవే పక్కనే సగం కాలిన మహిళ మృతదేహం.. ఎవరిది?
X
సంగారెడ్డి జిల్లా తూంకుంట గ్రామ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. జహీరాబాద్ జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కనిపించింది. సగం కాలిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని చూసిన ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపుగా ముఖం శరీర భాగాలు కాలిపోయాయి శవం గుర్తు పట్టని విధంగా ఉంది.
పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 20 సంవత్సరాల లోపు గల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి కాల్చి వేశారా లేదా సజీవంగా దహనం చేశారా అనే విషయాలపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పటల్ కు తరలించారు.. ఆమె వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఇదే సంగారెడ్డి జిల్లాలో రెండ్రోజుల క్రితం మరో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన కన్న కూతురిని మంజీరా నదిలో పడేసి, తాను కూడా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాయికొడ్ మండల పరిధిలోని మంజీరా నది వద్ద మంగళవారం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం అత్తగారింట్లో గొడవ పడి పుట్టింటి వచ్చిన విజయ అనే మహిళ... పుట్టింటి వారితోనూ గొడవపడింది. శనివారం రాత్రి కూతురితో సహ ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. మంగళవారం రాయికొడ్‌లోని మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లీ, కూతుళ్ల మృతదేహాలు నీళ్లపై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి రాయికొడ్ ఎస్సై వెంకట్‌రెడ్డి సిబ్బందితో చేరుకుని గజ ఈతగాళ్లతో మృతదేహాలను వెలికితీయించారు.