Home > తెలంగాణ > Half Day Schools : తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే..?

Half Day Schools : తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే..?

Half Day Schools : తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే..?
X

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ చివరిలో, మేలో మొదలవ్వాల్సిన ఎండలు ఇప్పటినుంచే స్టార్ అవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఈ నెల 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి మొదటి వారంలోనే సమ్మర్ ను తలపిస్తుడడంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఉండాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే క్లాసులు జరగనున్నాయి. ఆ తర్వాత గౌర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. కాగా ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ పెట్టి, ఆ తర్వాత సమ్మర్ హాలీడేస్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం ఎగ్జామ్ నిర్వహించి, మధ్యాహ్నం పిల్లలకు క్లాసులు చెప్పనున్నారు. విద్యార్థుల లంచ్ అనంతరం టీచర్లు క్లాసులు నిర్వహిస్తారు. టెన్త్ ఎగ్జామ్స్ పూర్తయిన తరువాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు.


Updated : 3 March 2024 8:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top